19న గోదావరిఖని ఆర్టీసీ డిపో ముందు ధర్నాను జయప్రదం చేయండి
గోదావరిఖని శ్రామిక భవన్, సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 19న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ధర్నాలకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా గోదావరిఖని బస్ డిపో వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు.