
రామగుండం: న్యాయవాదుల రిలే దీక్షకు సంఘీభావం తెలిపిన కన్నూరి సతీష్
చంపాపేటలో ఇజ్రాయెల్ అనే న్యాయవాదిని నడిరోడ్డు పై దారుణంగా హత్య చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని , అడ్వకేట్ రక్షణ చట్టం తీసుకురావాలని, 41 ఏ, సీఆర్పీసీ ని (30(3) ని అమెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో రిలే నిరాహార దీక్ష ప్రారంభం అయ్యాయి. బుధవారం ఖని కోర్ట్ ఎదుట ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాన్ని తాజా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ సందర్శించి సంఘీభావం తెలిపారు.