కర్ణాటకలో ఉండేవారు కన్నడ నేర్చుకోవాలి: సీఎం

81చూసినవారు
కర్ణాటకలో ఉండేవారు కన్నడ నేర్చుకోవాలి: సీఎం
కన్నడ భాష,ప్రాంతం, నీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కన్నడవాసికి ఉందని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. రాష్ట్రంలో కన్నడ సంస్కృతి ప్రతిబింబించేలా ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చిన ఆయన.. రాష్ట్రంలో నివసించేవారంతా స్థానిక భాషను నేర్చుకోవాలని సూచించారు. ‘కన్నడిగులు ఉదారంగా ఉంటారు. అందుకే ఇతర భాషలు మాట్లాడేవారూ స్వేచ్ఛగా నివసిస్తున్నారు. కన్నడమీద ప్రేమ పెంచుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మతోన్మాదులుగా మారకూడదు’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్