దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ-2024 పరీక్షను రద్దు చేసేది లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పేపర్ లీక్, అవకతవకలకు సంబంధించి మూడు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై గురువారం స్టే విధించింది. అన్ని పిటిషన్‌లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్‌టీఏ కోరిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. పరీక్ష రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని కేంద్రంతో పాటు ఎన్‌టీఏకు నోటీసులిచ్చింది. కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించాలని సూచించింది.