పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు సెన్సార్ పూర్తయింది. సినిమా రన్‌టైన్ 180.56 నిమిషాలు. అంటే ఏకంగా మూడు గంటలు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫుటేజ్ మొత్తం దాదాపు నాలుగున్నర గంటలు వచ్చిందని సమాచారం. అయితే ప్రేక్షకులు చూసేందుకు వీలుగా కథ, కథనాలు దెబ్బతినకుండా సినిమా రన్‌టైమ్‌ను 3 గంటలకు తీసుకొచ్చారు.