మల్లె పూల సాగులో పురుగుల నివారణ చర్యలు

52చూసినవారు
మల్లె పూల సాగులో పురుగుల నివారణ చర్యలు
ప్రస్తుతం మల్లె పూలకు మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. అయితే ఈ పంటకు ఎండు తెగులు సోకితే మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి కోమ్మలు ఎండిపోతాయి. తర్వాత మొక్క చనిపోతుంది. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క మొదలులో పోయాలి. అలాగే మొగ్గ తొలుచు పురుగులు కూడా మొగ్గ దశలో తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ పురుగు నివారణకు మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్