ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిలో గూడు మరియూ పూత రాలుటకు అనుకూలం, నివారణకు 2 మీ.లి ప్లానోఫిక్స్ మందును పది లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. -ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రా. కార్బెండజిమ్ మరియు 0.3 గ్రా. ప్లోనికామిడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
-పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని వరుసగా 3 రోజులు 7-8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
-పత్తిలో ఆకులు ఎర్రబడడం గమనించడమైనది. నివారణకు 10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రా. యూరియా మరియూ 1.5 గ్రా. బోరాక్స్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.