పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని

67చూసినవారు
పెంపుడు కుక్క మృతి.. దాని చైన్‌తోనే ఉరేసుకున్న యజమాని
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక దాని యజమాని రాజశేఖర్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. మంగళవారం అది అనారోగ్యంతో చనిపోయింది. అయితే దానిని ఖననం చేసిన అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. కుక్కకు ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకొని చనిపోయాడు.

సంబంధిత పోస్ట్