ఫార్మసిస్ట్‌లకు అన్ని రకాల అర్హతలు ఉన్న కూడా నిరుద్యోగులుగా ఆత్మన్యూనతా భావంతో నలిగిపోతున్నారు. దీని వల్ల ఫార్మసిస్ట్‌లు వ్యక్తిగతంగా నష్టపోవచ్చు కాని.. ఎక్కువగా నష్టపోయేది మాత్రం ప్రజలే. కాబట్టి ఫార్మసిస్ట్‌లకు ప్రభుత్వ వైద్యశాలల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయాలి. నిరుద్యోగులైన ఫార్మసిస్ట్‌లకు ఫార్మసీలు ఏర్పాటు చేసుకోడానికి వడ్డీ రహిత రుణ సౌకర్యం కల్పించాలి.