రైతు రుణమాఫీ ప్రధాని మోడీకి కనిపించడం లేదా?: తుమ్మల

59చూసినవారు
రైతు రుణమాఫీ ప్రధాని మోడీకి కనిపించడం లేదా?: తుమ్మల
హైాదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కార్యకర్తల సమస్యలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు చేశారు. 'మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే మాకు నిరసన సెగ తాకేది. అధికారం కోల్పోయిన బాధ ఒకరిది.. అధికారంలోకి రావాలనే బాధ మరొకరిది. రైతు రుణమాఫీ ప్రధాని మోదీకి కనిపించడం లేదా?' అని అన్నారు.

సంబంధిత పోస్ట్