ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఆయన శౌర్యం, దార్శనికత స్వరాజ్య స్థాపనకు పునాది వేసిందని కొనియాడారు. భారత్‌ను మరింత దృఢంగా తీర్చిదిద్దేందుకు ఎల్లవేళలా శివాజీ మహారాజ్ మనకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వీడియోను Xలో పోస్ట్ చేశారు.