బీపీ, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించి దేశవ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు ఉచితంగా ఈ పరీక్షలు జరపనున్నట్లు తెలిపింది. 30 ఏళ్లు పైబడిన వ్యక్తులు తమ సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాధులకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.