పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ థియేటర్ ఓనర్లకు కోర్టు భారీ జరిమానా విధించింది. నిర్దేశిత సమయానికి చిత్రాన్ని ప్రదర్శించకుండా 25 నిమిషాలు యాడ్స్ వేయడంతో అభిషేక్ అనే వ్యక్తి ఇటీవల బెంగళూరు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కన్జ్యూమర్ కోర్టు టికెట్‌పై ఉన్న స్క్రీనింగ్ టైంకే సినిమాను స్టార్ట్ చేయాలని, ఆలస్యం చేసినందుకు అతనికి రూ.30వేలు జరిమానా కట్టాలని ఆదేశించింది.