జూన్ 18న వారణాసికి ప్రధాని మోదీ

80చూసినవారు
జూన్ 18న వారణాసికి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈనెల 18న తొలి సారిగా తన నియోజకవర్గం వారణాసికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ‘కిసాన్ సమ్మేళన్’ (రైతుల సదస్సు)లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో పాల్గొంటారని బీజేపీ నేతలు తెలిపారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ వరుసగా మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్