అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇసుకపూడి గ్రామానికి చెందిన వీరేంద్ర సౌదీలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎడారిలో కష్టాలు పడుతున్నానని, కాపాడాలంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వీరేంద్రను సొంతూరికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. తాజాగా వీరేంద్ర తన ఇంటికి చేరుకున్నాడు.