రామ్ ప్రవీష్ ఠాకూర్.. 1986వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఏపీ డీజీపీగా కూడా అప్పటి చంద్రబాబు హయాంలో బాధ్యతలు చేపట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు ఠాకూర్. ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ హైదరాబాదులోని తన నివాసం నుంచి ఏపీలో ఏ పోలీసు అధికారికి ఎలాంటి పోస్టింగ్ ఎక్కడ ఇవ్వాలో నిర్ణయిస్తున్నట్లు సమాచారం.