ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్ల కాలంలో 2,853మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ ఐదేళ్లలో అత్యధికంగా 2023సంవత్సరంలో 628 మంది చనిపోయారు. 2019లో 587 మంది, 2020లో 471 మంది, 2021లో 557 మంది, 2022 లో 610 మంది, 2023లో 628మంది మృతికి ఏనుగులు కారణమైనట్టు కేంద్ర పర్యావరణశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు.