బ్రూనైలోని సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని మోదీ

82చూసినవారు
బ్రూనైలోని సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆ దేశంలోని సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. ఆ పర్యటనకు సంబంధించిన చిత్రాలను కూడా మోదీ షేర్ చేశారు. అంతకుముందు, బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్ లో మోదీకి ఆ దేశ యువరాజు స్వాగతం పలికారు. భారత్-బ్రూనై మధ్య దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే, ఓ భారత ప్రధాని బ్రూనై దేశానికి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం వెళ్లడం ఇదే మొదటిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్