యంగ్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘RAPO22’. ఈ చిత్రానికి మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇక న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ఉదయం 10:35 గంటలకు ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ రామ్, భాగ్యశ్రీల స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారట. దీనిని వెల్లడిస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.