TG: రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయనున్న 6 గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకునేందుకు ప్రజలు భారీగా ప్రజాభవన్‌కు తరలివస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి ఈనెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాభవన్‌కు దరఖాస్తుదారులు పోటెత్తారు. దీంతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. కిలోమీటర్ మేర భారీ క్యూ లైన్‌లో దరఖాస్తుదారులు నిలబడి ఉన్నారు.