అరటి గెలలను కోసిన తరువాత వెంటనే నీడలో వుంచాలి. ఎండలో వుంచరాదు. ఎండలో వుంచడం వల్ల కాయ లోపల వేడిమి పెరిగి కాయలు త్వరగా పండటం ప్రారంభిస్తాయి. తద్వారా ఎక్కువకాలం నిలువ ఉంచలేము. కాయలను శుభ్రపరచుటకు 0.5 గ్రాముల బావిస్టన్ మందును లీటరు నీటికి కలిపినట్లయితే ఎలాంటి శిలింద్రాములు ఆశించకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. లేత కాయలు, బాగా పండిన కాయలను, ముదిరిన కాయలతో కలిపి నిలువ ఉంచరాదు.