వరి పంటలో కాండం తొలుచు పురుగు నివారణ

74చూసినవారు
వరి పంటలో కాండం తొలుచు పురుగు నివారణ
యాసంగీ వరి పంటలో మొవ్వ చనిపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా వరి పంటలో కాండం తొలిచే పురుగు రెండు దశల్లో(పిలుక, చిరు పొట్ట) ఆశిస్తుంది. కనుక మార్చి నెలలో వరి పంట అంకురం నుంచి చిరుపొట్ట దశల్లో ఉన్న పైర్లలో రెక్కల పురుగు ఉదృతిని బట్టి మందులు పిచికారి చేయాలి. నివారణకు కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50%SP 2 గ్రా. (400 గ్రా./ ఏకరాకు) లేదా ఎకరాకు క్లోరాంట్రానీలిప్రోల్ 0.3 ml(60 ml ఎకరాకు) ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్