వంట నూనెల ధరల పెంపుతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న సరకును కూడా ఎక్కువ ధరలకు విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన కంపెనీల నుంచి లోడింగ్ నిలిచిపోయిందని వ్యాపారులు అంటున్నారు. వంట నూనెల ధరలు నిన్నటి వరకు ఎమ్మార్పీ కంటే తక్కువగా ఉన్నాయి. దిగుమతి సుంకం పెంపుదలపై ప్రకటన రావడంతో ఎక్కడికక్కడ ధరలు పెంచారు. ఎమ్మార్పీ ఎంత ఉంటే అంతే ధర నిర్ణయించారు. ఆన్‌లైన్ సంస్థల్లోనూ కొద్దిసేపు వంట నూనెల అమ్మకాలను నిలిపివేసి, పెంచిన ధరలతో సవరించాయి.