పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్ సెక్టార్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నేరాలకు పాల్పడి గతంలో విఫలం అయ్యిందని అన్నారు. ఉగ్రవాదం, ప్రచ్ఛన్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోందని విమర్శించారు. పూర్తి స్థాయి దళాలతో ఉగ్రవాదుల్ని మా సైనికులు అణిచివేస్తారని, శత్రువుకు బలమైన సమాధానం ఇస్తామని ప్రధాని పేర్కొన్నారు.