పటేల్ గూడకు చేరుకున్న ప్రధాని మోడీ

568చూసినవారు
పటేల్ గూడకు చేరుకున్న ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పటాన్ చెరు పటేల్ గూడకు చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.9,021 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పటాన్ చెరులోని పటేల్ గూడలో బీజేపీ విజయ సంకల్ప సభలో మోడీ ప్రసంగిస్తారు. మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్