నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ దేశ పార్లమెంట్‌లో షాక్ తగిలింది. విశ్వాస తీర్మానం ఓటింగ్‌లో ఆయన ఓడిపోయినట్లు శుక్రవారం స్పీకర్ ప్రకటించారు. 275 సీట్ల పార్లమెంటులో మొత్తం 258 మంది ఎంపీలు హాజరయ్యారు. వారిలో ప్రధానికి వ్యతిరేకంగా 194 ఓట్లు రాగా, మద్దతుగా కేవలం 63 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఒకరు ఓటింగ్ సమయంలో గైర్హాజరయ్యారు. దీంతో ప్రధాని పదవికి పుష్ప కమల్ దహల్ కాసేపటిలో రాజీనామా చేయనున్నారు.