రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం: సీఎం

53చూసినవారు
రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యం: సీఎం
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రోడ్లను బాగు చేయడం ఒక విధానం అన్నారు. తక్షణం రహదారులపై గుంతలు పూడ్చడం, వెంటనే మరమ్మతులు చేయాల్సిన రోడ్లపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు. ఏ మేర దెబ్బతిన్నాయి అనే విషయంలో సత్వరమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి సాంకేతికంగా అందుబాటులోకి వచ్చిన కొత్త విధానాలపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్