మేకులు మింగిన ఖైదీ

77చూసినవారు
మేకులు మింగిన ఖైదీ
రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న యువకుడు ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన చర్లపల్లి జైల్లో జరిగింది. రిమాండ్ ఖైదీగా ఉన్న మహ్మద్ షేక్(32) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఇనుప మేకులు ఉన్నట్లు వైద్యులు ఎక్స్ రేలో గుర్తించారు. దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా తొమ్మిది మేకులను బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్