హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందర్శించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఇటీవల అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె నేడు చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు. మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీలో ప్రియాంక హీరోయిన్‌గా ఎంపికయ్యారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్ వచ్చారంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.