మలయాళ డైరెక్టర్ షఫీ(56) నేడు మృతి చెందారు. జనవరి 16న గుండెపోటు రాగా కొచ్చి లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈయన ఎక్కువగా కామెడీ ఓరియెంటెడ్ సినిమాలనే తెరకెక్కించారు. దాదాపు 50 సినిమాలకు షఫీ దర్శకత్వం వహించారు. ఈయన తొలి చిత్రం ‘వన్ మాన్ షో’. 2022లో తన చివరి సినిమాను తెరకెక్కించారు. షఫీ మృతితో మలయాళ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.