TG: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని అమ్మాపురం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకానికి వంట సామగ్రి పంపిణీ చేసేందుకు వెళ్లారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భోజనం సరిగ్గా ఉండట్లేదని, తినలేకపోతున్నామని యశస్విని రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వినకపోవడంతో కారు ఎక్కి వెళ్లిపోయినట్లు సమాచారం.