వృద్ధురాలిని మెట్లపై నుంచి తోసేశాడు (వీడియో)

81చూసినవారు
న్యూయార్క్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. క్వీన్స్ ప్రాంతంలో సెయింట్ డెమెట్రియోస్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చికి 68 ఏళ్ల మహిళ ఇటీవల వెళ్లింది. ఆ సమయంలో ఓ దుండగుడు ఆమెను వెంబడించాడు. అనంతరం మెట్లపై నుంచి కిందికి ఆమెను నిర్దాక్షిణ్యంగా తోసేశాడు. కింద పడిన తర్వాత ఆమె పర్సును దొంగిలించాడు. ఆమె కారును సైతం నిందితుడు చోరీ చేశాడు. ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్