తిరుపతి జిల్లాకి చెందిన తన అభిమాని ఈశ్వరయ్య, ఆయన కుటుంబాన్ని మెగాస్టార్ చిరంజీవి సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సత్కరించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈశ్వరయ్య తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే అతని కుటుంబాన్ని చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడారు. వారికి తానెప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.