ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. ఇప్పటికే అన్ని రికార్డులు బ్రేక్ చేయగా తాజాగా కెనడాలోనూ హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీగా ‘పుష్ప 2’ నిలిచింది. ఈ మూవీ కెనడాలో ఏకంగా 4.13 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఈ రికార్డు నెలకొల్పింది. గతంలో ‘కల్కి 2898 ఎడి’ 3.5 మిలియన్ డాలర్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా తాజాగా పుష్ప-2 ఆ రికార్డును బ్రేక్ చేసింది.