పుష్ప-2 సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరాబాద్‌లో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. శ్రీరామ్ థియేటర్ వద్ద అభిమానుల డీజే పాటలతో కోలాహలం మొదలైంది. డైరెక్టర్ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి శ్రీరామ్ థియేటర్‌కు చేరుకున్నారు. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ సినిమా థియేటర్లలో విడుదల కానుడటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.