హీరో అక్కినేని నాగార్జున జ్యేష్ఠ పుత్రుడు హీరో నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లి వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో బుధవారం (Dec 4) కుటుంబసభ్యులు, బంధుమిత్రుల నడుమ వేద మంత్రాల సాక్షిగా చైతు-శోభిత జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.