తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 సినిమా సందడి నెలకొంది. ప్రీమియర్ షో నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మూవీ చూసేందుకు హీరో అల్లు అర్జున్ వస్తుండటంతో అభిమానులు పోటెత్తారు. సినీ అభిమానులంతా రోడ్డుపైకి రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.