న్యూయార్క్‌లో దారుణం చోటుచేసుకుంది. అమెరికాలో ప్రముఖ ఇన్సూరెన్సు సంస్థ యునైటెడ్ హెల్త్‌కేర్ సీఈవో బ్రియాన్ థాంప్సన్ హత్యకు గురయ్యారు. మిడ్టౌన్లోని హిల్టన్ హోటల్ బయట బుధవారం ఉదయం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖానికి మాస్కుతో వచ్చిన దుండగుడు బ్రియాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.