తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో వాన పడుతోంది. కాగా బుధవారం నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే.