కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సోనియా చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తల్లి సోనియా వెంట ప్రియాంకా గాంధీ ఉన్నారు. కాగా నేడు, రేపు కర్ణాటకలోని బెళగావిలో జరగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సోనియా గాంధీ, ప్రియాంక హాజరు కావాల్సి ఉంది. అస్వస్థత కారణంగా వీరు సమావేశాలకు దూరమయ్యారు. దీంతో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.