ఏపీలో పెద్ద ఎత్తున చేపడుతున్న రోడ్ల మరమ్మతు పనులు లక్ష్యం మేరకు పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా గోతులమయైన రోడ్లను సంక్రాంతి నాటికి బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గుంతల్లేని రహదారుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే గత బకాయిలు, వాతావరణ ప్రతికూలతల వల్ల సంక్రాంతి నాటికి లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.