RAIN: వణుకుతున్న ఉత్తరాఖండ్

54చూసినవారు
RAIN: వణుకుతున్న ఉత్తరాఖండ్
ఎడతెరపి లేని వర్షాలు ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రంలోని ప్రధాన నదులన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద, మందాకిని, భగీరథి నదులు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటేసి ప్రవహిస్తుండగా.. గంగా, సరయు నదులు ప్రమాదకరస్థాయికి చేరుతున్నాయి. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయోగ వద్ద నది పక్కన ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్