తన కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలపై మోహన్ బాబు స్పందించారు. 'మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీప్రసన్న, విష్ణు కంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలనుకున్నాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. ఈరోజు గుండెల మీద తన్నావ్. మనసు ఆవేదనతో కుంగిపోతోంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం' అని చెప్పుకొచ్చారు.