పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్' మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా టీజర్, 2025 సంక్రాంతికి మాస్ పాట విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.