రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మునిసిపల్ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెనుక కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ నీరు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆదివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.