అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లిపురం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 17లో ఉన్న ప్లాట్ల యజమానులు అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు, 1986 మరియు 87 సంవత్సరంలో సుమారు 1000 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. అనంతరం ఈ మధ్యకాలంలో కొంతమంది భూకబ్జాదారులు రాజకీయ పలుకుబడితో తమ ప్లాట్లు అన్నిటిని తొలగించి వెంచర్లు చేసి కబ్జాలకు పాల్పడుతున్నారని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు.