కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు క్రమ శిక్షణతో పనిచేయాలని, శాంతి భద్రతలు రక్షణకు నిబద్ధత తో పనిచేయాలని ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం లోని ఆక్టోపస్ ఆవరణలోని 3వ బెటాలియన్ లో శిక్షణ పూర్తిచేసుకున్న 4వ బ్యాచ్ 288 కానిస్టేబుల్స్ దీక్షన్త్ పరేడ్ కు ముఖ్య అతిధిగా హాజరైన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి హాజరయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్ లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.