పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలి: ఎస్పీ

64చూసినవారు
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలి: ఎస్పీ
పోలీసులు అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం కోస్గి పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది వివరాలను, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై బాల వెంకటరమణను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని చెప్పారు. స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజల రక్షణ పోలీసుల బాధ్యత అని అన్నారు.

సంబంధిత పోస్ట్