ఆటోలో మర్చిపోయిన నగదు అందజేత

55చూసినవారు
ఆటోలో మర్చిపోయిన నగదు అందజేత
ఆటోలో ప్రయాణిస్తూ మర్చిపోయిన నగదు ఉన్న బ్యాగును తిరిగి అప్పగించిన ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సచివాలయనగర్లో ఒక మహిళ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో తనతో పాటు తీసుకువచ్చిన నగదు బ్యాగును మరిచిపోయింది. మంగళవారం సాయంత్రం బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించి అందులో ఉన్న బ్యాగుతో పాటు 15వేలు, సెల్ ఫోన్ ఇతర వస్తువులను బుధవారం సీఐ అశోక్ రెడ్డి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్