స్వచ్ఛమై గాలి, నీరు కావాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి పరిరక్షణకు కృషి చేయాలని బుధవారం బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని ఎస్కేడీనగర్ సురభి పార్క్ కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటడంతో పాటు సందర్శకులు కూర్చునేందుకు కార్పొరేటర్ తన సొంత నిధులతో బెంచీలను ఏర్పాటు చేశారు. పార్కును మరింత అభివృద్ధి చేయడంతో పాటు కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.